![]() |
![]() |

ప్రేరణకంబమ్ బిగ్ బాస్ సీజన్ 8 ఫైనలిస్ట్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే కామనర్స్ కి ముందుగా అగ్ని పరీక్ష పేరుతో కొన్ని టాస్కులు పెట్టి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తున్నారు. ఇక ఇప్పుడు అగ్ని పరీక్ష షూటింగ్ ఐతే జరుపుకుంటోంది. ఈ టైములో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కొన్ని టిప్స్ చెప్పిస్తున్నారు. రీసెంట్ అమరదీప్ చెప్పగా ఇప్పుడు ప్రేరణ కూడా టిప్స్ ఇచ్చింది. "మీరు ఒక కామనర్ గా వెళ్తున్నారో మీరు ఎందుకు స్పెషలో తెలియాలి కదా. బిగ్ బాస్ హౌస్ లో ఉండగలరా సర్వైవ్ అవ్వగల అన్నది తెలియాలి అంటే ముందుగా అగ్ని పరీక్షలో సర్వైవ్ అవ్వాలి. అగ్ని పరీక్షలో చాల టాస్కులు ఉంటాయి.
కాబట్టి అక్కడ ఎలాంటి డ్రామాలు, యాక్టింగ్ లు చేయకండి. ఇంటర్వ్యూస్ ఉంటే మీలాగే ఇవ్వండి ఎందుకంటే ప్రతీ చోట కెమెరా ఉంటుంది. మీరు నటిస్తున్నారన్న విషయం కెమెరాకి తెలిసిపోతుంది. బిగ్ బాస్ నేను చూసాను ఆ హౌస్ లో వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అనే కాన్సెప్ట్ ని మీ మైండ్ నుంచి తీసేయండి. మీరు మీలాగే ఉండండి. మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా అనుకుని మీరేంటో అదే చూపించండి. అదే జనాలకు కూడా నచ్చుతుంది. ఇక టాస్కుల విషయానికి వస్తే అన్ని విషయాలు మర్చిపోయి అందులో పాస్ అవ్వడం ఎలాగో నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్" అంటూ చెప్పింది ప్రేరణ.
![]() |
![]() |